Can't be Blocked Perpetually |Supreme Court Asks Centre| రహదారులను దిగ్బంధించడంపై సుప్రీం అసంతృప్తి

Share this & earn $10
Published at : October 06, 2021

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల సందర్భంగా జాతీయ రహదారులను దిగ్బంధించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనపై నోయిడా వాసి ఒకరు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కిషన్ కౌల్ , జస్టిస్ M.M.సుందరేశన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. దారుల మూసివేత వల్ల 20 నిమిషాల ప్రయాణానికి, రెండు గంటలు పడుతోందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం నిరంతరం జాతీయ రహదారులను ఎలా దిగ్బంధిస్తారని ప్రశ్నించింది. రహదారులను మూసివేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని పేర్కొంది. సమస్యను న్యాయ వేదిక, నిరసన, పార్లమెంటరీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ధర్మాసనానికి వివరణ ఇచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించామని వెల్లడించారు. చర్చలకు నిరసనకారులు నిరాకరించారని.. వారిని ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- Can't be Blocked Perpetually |Supreme Court Asks Centre| రహదారులను దిగ్బంధించడంపై సుప్రీం అసంతృప్తి
ETVETV TeluguETV NewsVideo